భళా బాహుబలి: రికార్డ్ సృష్టించిన ప్రభాస్…

-

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఆ తర్వాత తీసిన ఏ సినిమా కూడా తెలుగు అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాలీవుడ్ లో మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. కాగా ఈ మధ్యనే విడుదల అయిన ప్రభాస్ మూవీ ఆదిపురుష్ కూడా తెలుగు లో యావరేజ్ టాక్ ను అందుకుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ నటించిన బాహుబలి నుండి నేటి ఆదిపురుష్ వరకు మంచి వసూళ్లను అందుకున్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ రూ. 100 కోట్ల కలెక్షన్ లను సాధించింది…ఇంతకు ముందు ప్రభాస్ నుండి వచ్చిన బాహుబలి, సాహో , రాధే శ్యామ్ లు కూడా రూ. 100 కోట్ల కలెక్షన్ లను అందుకున్నాయి.

దీనితో బాలీవుడ్ లో వరుసగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించిన నాలుగవ చిత్రంగా రికార్డు కెక్కింది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఈ క్రెడిట్ అందుకున్న సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news