ఎడిట్ నోట్ : బాబొస్తేనే జోష్ వ‌స్తుందా ?

-

జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు 70 ఏళ్లు దాటిన పెద్దాయ‌న, 40 ఏళ్లు దాటిన కుర్రాడ‌యిన జ‌గ‌న్ క‌న్నా వేగంగానే వ‌చ్చారు. పార్టీని బ‌తికించుకుంటాను అని ఆయ‌న ఆశ ప‌డుతున్నారు. పెద్దాయ‌న చెమట్లు పోస్తున్నారు. సెల్ఫీల బ్యాచ్ ఒత్తిడిని కూడా త‌ట్టుకుంటున్నారు. ఎవ‌రు ఏం ఇచ్చినా తింటూ తాగుతూ వెళ్తున్నారు. ఒకప్పుడు క‌న్నా ఇప్పుడు పార్టీ బాలేదు. ఆ మాట‌కు వ‌స్తే టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో బాగుప‌డిన వారు ఎవ్వ‌రూ ఆయ‌న‌తో ఇవాళ లేరు. ఆ విధంగా ఎవ‌రికి వారే త‌మ దారి తాము చూసుకుని వెళ్తున్నారు.

chandrababu
chandrababu

ఇప్ప‌టికీ ఉన్న కొద్ది పాటి అధికార ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా లేరు. అచ్చెన్నాయుడు లాంటి ఏ కొద్దిమందో వివాదాలున్నా కూడా మాట్లాడేందుకు ముందుకు వ‌స్తున్నారు. వైసీపీ పెద్ద‌లు ఎన్నో సార్లు ఆయ‌న్ను టార్గెట్ చేసినా కూడా భ‌య‌ప‌డ‌క, వెనుక‌డుగు వేయ‌క అబ్బాయి ఎంపీ రామూతో క‌లిసి ప్ర‌యాణిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అన్న‌య్య ఎర్ర‌న్నాయుడు అందించిన క్ర‌మ‌శిక్ష‌ణ వీడిపోమ‌ని ఆ కుటుంబం ఇప్ప‌టికీ టీడీపీతోనే ఉంది. ఇదే త‌ర‌హాలో మిగిలిన కుటుంబాలు లేవు. పెద్ద‌గా స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్న‌మేదీ చేయ‌డం లేదు. అందుక‌ని బాబు క‌ష్టం ఒక్క‌టే ఫ‌లించాలంటే క‌ష్ట‌మే !

తెలుగుదేశం పార్టీలో జ‌వం జీవం నింపే ప్ర‌క్రియ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నారా చంద్ర‌బాబు నాయుడే చేస్తున్నారు. అధినేత క‌ష్టం ఫ‌లిస్తే రేపు అధికారం త‌మ్ముళ్లు అనుభ‌విస్తారు. ఊళ్ల‌లో కాల‌ర్ ఎగరేసి వైసీపీ నాయ‌కుల‌తో త‌గువులు పెట్టుకుంటారు. కానీ ఆయ‌న క‌ష్టంలో భాగం మాత్రం కాలేరు. కాబోరు కూడా ! అలాంట‌ప్పుడు ఆయ‌నొక్క‌డే ఎందుకు క‌ష్ట‌ప‌డాలి. ఆయ‌నొక్క‌డే ఎందుకు వీరంద‌రి త‌ర‌ఫునా వైసీపీ పెద్ద‌ల‌తో తిట్లు ప‌డాలి. ఇవి కూడా కార్య‌క‌ర్త‌లు ఆలోచించి కార్యోన్ముఖులు కావాలి. లేదంటే క‌ష్ట‌మే !

Read more RELATED
Recommended to you

Latest news