బిగ్ బ్రేకింగ్; కెసిఆర్, చంద్రబాబు భేటీ…?

-

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ, తెరాస ఎంత బలంగా ఉన్నా సరే… ఆ రెండు పార్టీల మధ్య మాత్రం ఏ విధంగా చూసినా సయోధ్య ఉండే అవకాశం ఉండదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. 2014 లో ఆంధ్రాలో చంద్రబాబు తెలంగాణాలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వరకు వెళ్ళాయి.

ఇప్పుడు తెలంగాణాలో కెసిఆర్ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణా మీద చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. తన నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సమీక్షా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. పార్టీ పరిస్థితి విషయంలో తెలంగాణా పార్టీ చీఫ్ ఎల్ రమణను ఆయన క్లాస్ కూడా పీకారు.

త్వరలో బల్దియా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగే ఆలోచన చేస్తుంది. ఇటీవల చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కెసిఆర్ తో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కెసిఆర్ కి కేంద్రం వద్ద మంచి పేరే ఉంది. గత కొన్ని రోజులుగా చంద్రబాబు కేంద్రంతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినా సరే ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఈ నేపధ్యంలోనే కెసిఆర్ తో ముందుకి వెళ్ళాలి అని చంద్రబాబు భావిస్తున్నారు. కెసిఆర్ ద్వారా దగ్గరయ్యే ప్రయత్నాలు చంద్రబాబు మొదలుపెట్టారని అంటున్నారు. అలాగే తెలంగాణాలో టీడీపీ ని పూర్తిగా తెరాస లో కలిపేసే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్టు సమాచారం. వీరి భేటికి అసలు ప్రధాన కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఉగాది తర్వాత కచ్చితంగా భేటి అవుతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news