కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరణ

-

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా ధృవీకరించారు.2024 ఎన్నికల సన్నద్ధత కోసం కాంగ్రెస్ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజంటేషన్ పై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యాక్షన్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ కమిటీలో ఉండేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని, సోనియా ఆయనను పార్టీలోకిి ఆహ్వానించిన నిరాకరించినట్టు సర్జేవాలా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని ప్రశాంత్ కిషోర్ తీసుకోవచ్చని గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.పార్టీ హైకమాండ్ ముందు ఆయన 18 గంటల పాటు ప్రజెంటేషన్ ఇవ్వడంతో దీనిపై ఊహాగానాలు మొదలయ్యాయి.ఇప్పటికే చాలాసార్లు ఆయన సోనియా గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.తాజాగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రశాంత్ కిషోర్ చేసిన కృషిని, పార్టీ కి ఇచ్చినసూచనల్ని తాము అభినందిస్తున్నట్లు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news