BREAKING: మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ

-

ఆంధ్ర ప్రదేశ్లో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు సమ్మతంగా లేదని ఉద్యోగులు నిరసనలకు దిగారు. సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు మంత్రుల కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులను మంత్రుల కమిట చర్చలకు ఆహ్వానించింది. అయితే ఉద్యోగులు మాత్రం చర్చలకు వెళ్లలేదు.

అయితే తాజా మంత్రులతో ఉద్యోగులు ఈరోజు భేటీ అయ్యారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, బుగ్గన, సజ్జల హాజరయ్యారు. స్టీరింగ్ కమిటీలోని 20 మందికి మాత్రమే సమావేశానికి రావడానికి అనుమతి ఇచ్చింది. ఈ భేటీకి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు  వెంటక్రామిరెడ్డి, సూర్య నారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్ మొదలైన వారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మంత్రులు ఉద్యోగులకు వివరించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news