వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండు రోజుల క్రితమే సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉండగా, అరెస్టు చేసినట్లుగా శుక్రవారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీతి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నిధితుడు సైఫ్ కు సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైఫ్ ప్రీతికి పంపిన సందేశాలు పోలీసులు పరిశీలించారు. కావాలనే ప్రీతిని సైఫ్ టార్గెట్ చేశాడంటూ వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు సైఫ్ ని కోర్టులో హాజరపరిచారు. అతడికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు ర్యాగింగ్ కేసులు నమోదు అయ్యాయి.