గాడ్ ఆఫ్ క్రికెట్ సచినా టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే అర్జున్ ఆడేది రెండో ఐపీఎల్ మ్యాచే అయినా.. అనుభవజ్ఞుడైన బౌలర్‌లా ఆఖరి ఓవర్‌లో బంతులు లు సంధించి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌పై ముంబయి జట్టు విజయం సాధించేందుకు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ పర్ఫామెన్స్పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అతడిపై విమర్శలు చేసిన వారు.. ఇప్పుడతడి ఆటతీరును చూడాలని సూచిస్తున్నారు.
‘చాలా మంది బంధుప్రీతి అంటూ అతడిని ఎగతాళి చేశారు. ఈ మ్యాచ్‌లో అతడేంటో నిరూపించుకున్నాడు. అర్జున్‌కు అభినందనలు. సచిన్ కచ్చితంగా గర్వించాలి’ అంటూ బాలీవుడ్ నటి, పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా ట్వీట్ చేశారు.
Many mocked him for nepotism but tonight he has shown his spot is well earned 👏 Congrats Arjun. @sachin_rt you must be so proud #Arjuntendulkar #SRHvsMI #TATAIPL2023
— Preity G Zinta (@realpreityzinta) April 18, 2023
‘అర్జున్ ఎంతో ఎదిగాడు. ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడు. తొలి వికెట్ కూడా తీసుకున్నాడు. పాజీ(సచిన్)కి అభినందనలు.. అర్జున్‌కు విజయవంతమైన సుదీర్ఘ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను’– మహమ్మద్ ఖైఫ్
‘అర్జున్ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం అతడికి లభించింది. ఒక తండ్రిగా సచిన్ ఎంతో గర్వపడాలి. భవిష్యత్తులో గొప్ప విజయాలకు ఇది ఆరంభం మాత్రమే’– సెహ్వాగ్
‘యువ టెండూల్కర్ నుంచి ఇలాంటి ఆటతీరు చూడటం ఎంతో సంతోషంగా ఉంది’ –ఇర్ఫాన్ పఠాన్.