మరో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మహారాష్ట్ర రెండవ రాజధాని నాగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మరో వందే భారత్ రైలును ప్రారంభించారు. నాగపూర్- బిలాస్పూర్ మధ్య తిరగనున్న ఈ రైలు.. 413 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 30 నిమిషాలలోనే చేరుకోనుంది. గొండియా, రాజ్ నంద్ గాన్, దుర్గు, రాయపూర్ మీదుగా బిలాస్పూర్ వెళ్లనుంది.

ఈ రైలుని జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక అనంతరం నాగపూర్ నుంచి షిరిడి కనెక్టివిటీని అందించే నాగపూర్ మెట్రో ఫస్ట్ పేజ్ సమృద్ధి మహమార్గ్ ని కూడా మోడీ ప్రారంభించనున్నారు. అలాగే సిటీలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా 75 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా జనవరిలో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news