ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారులు

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా నేడు ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు ఆమె ఇంటికి చేరుకున్నారు సిబిఐ అధికారులు. ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ అధికారులు రెండు వాహనాలలో చేరుకున్నారు. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో విచారణ చేసి, స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సిఆర్పిసి కింద కవితను సిబిఐ అధికారులు విచారించుచున్నారు.

అయితే ఈ కేసులో కవిత ఈనెల 6వ తేదీననే సిబిఐ అధికారులు విచారించాల్సింది.. కానీ ఇతర కార్యక్రమాలలో ఆమె బిజీగా ఉండడంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సిబిఐ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ సిబిఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారిస్తున్నారు. ఈ విచారణ కోసం కవిత ఇంట్లోనే ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సిబిఐ వివరణ తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news