దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కరోనా కట్టడిపై చర్యలకు దిగారు. ఉదయం 11 గంటలకు కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లు,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రధాని మోడీ నిర్వహిస్తున్నారు. తొలి విడతగా కర్నాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల జిల్లా అధికారులతో సమావేశం అవుతారు.
మోడీ కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై అధికారులు తీసుకుంటున్న చర్యలు సహా వారి అనుభవాలను మోడీ తెలుసుకుంటారు. ఎల్లుండి 10 రాష్ట్రాల కు చెందిన 54 జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ని ఆయన నిర్వహించే అవకాశం ఉంది.