కుక్క బర్త్ డేను గ్రాండ్ గా జరుపుకుంటున్న సమంత.. నెటిజన్ల ఆగ్రహం !

ఏం మాయ చేసావ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది నాగచైతన్య- సమంత. ఇదే సమయంలో ప్రేమలో పడ్డారు. ముందుగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారి పోయింది. 2017 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగు సంవత్సరాలు చాలా ఎంజాయ్ గా లైఫ్ గడిపిన వీరిద్దరూ… కొన్ని రోజుల కింద విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు.

కొన్ని అనివార్య కారణాలవల్ల.. తాము విడిపోతున్నట్లు సమంత, నాగచైతన్య ప్రకటించారు. ఇకముందు స్నేహితులుగా ఉంటామని కూడా పేర్కొన్నారు. అయితే నిన్న నాగచైతన్య పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఒక స్నేహితుడిగా నాగచైతన్యకు సమంత బర్త్డే విషెస్ చెబుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే సమంత దానిపై అసలు కూడా స్పందించలేదు. ఇక ఇవాళ… తన కుక్క బర్త్ డేను అని మాత్రం ఫుల్ ఎంజాయ్ గా సెలబ్రేట్ చేసుకుంది సమంత.

Hash (హాష్ కుక్క పేరు) హ్యాపీ బర్తడే అంటూ… తన సోషల్ మీడియాలో తెగ పోస్టర్లు పెడుతోంది సమంత. అయితే దీనిపై నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. నిన్న నాగచైతన్యకు విషెస్ చెప్పకుండా… ఓ జంతువుకు మాత్రం.. ఇంత అవసరమా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక మిత్రునిగా నాగచైతన్యకు విషెస్ చెప్పకపోవడం చాలా బాధాకరం అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.