Prithviraj Sukumaran: మరో సినిమా వచ్చేస్తోంది..‘కడువా’ విజయంపై పృథ్వీరాజ్ ధీమా

-

మాలీవుడ్(మలయాళం) మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్​ సుకుమారన్ తాజా చిత్రం ‘కడువా’. ఈయన నటించిన చిత్రాలు ‘బ్రో డ్యాడీ’, ‘జన గణ మన’ ఇటీవల విజయం సాధించాయి. కాగా, ఇప్పుడు ‘కడువా’ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నారు. షాజీ కైలాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ భీమ్లా నాయక్‌’ ఫేమ్ సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించింది.

యాక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ సక్సెస్ పైన మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 30 విడుదల కానున్న ఈ సినిమాలో..పృథ్వీరాజ్ యాక్షన్ హైలైట్ గా నిలవబోతున్నదని మేకర్స్ చెప్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పిక్చర్ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్.

ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. మ్యాజిక్‌ ఫ్రేమ్స్‌, పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో లిస్టిన్‌ ష్టీఫెన్‌, సుప్రియా మీనన్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. జెక్స్‌ బిజోయ్‌ సింగీతం అందించాడు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ పోలీసు పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news