సీఎం సీటుపై గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

-

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి తనకు ఎమ్మెల్యే అవాలని కానీ, మంత్రి అవాలని కానీ ఆశలు లేవని అన్నారు. అయితే, తాను కనుక మనసు పెడితే మాత్రం ఒక్క రోజైనా ముఖ్యమంత్రిని అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మొన్న తన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. బళ్లారిలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో గాలి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదన్నారు.

Karnataka court orders criminal case against former Minister G Janardhana  Reddy for illegal mining, sale of iron ore

తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా లేదని స్పష్టం చేశారు గాలి జనార్దన్‌రెడ్డి. తనకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా తనతో చెప్పినట్టు తెలిపారు గాలి జనార్దన్‌రెడ్డి . కాగా, ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే కార్యకర్తలు ఆయనపై పూలవాన కురిపించారు. అయితే.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news