మరోసారి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో ప్రియమణి

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన దాదాపుగా యాక్ట్ చేసిన ఈ సుందరి..ప్రస్తుతం ఓ వైపు బుల్లితెరపైన ‘ఢీ’షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరో వైపున వెండితెరపైన కనబడుతోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది.

అయితే.. ప్రస్తుతం ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాక్టర్ 56’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా, రాజేష్ ఆనంద లీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ పై ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news