మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులు తొలగించాలని టీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ ను తొలగించాలని కోరుతూ ఈనెల 10న ఎన్నికల కమిషన్‌ను టీఆర్ఎస్ కోరింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది.
త్వరలో మునుగోడు ఉపఎన్నిక వస్తోన్నందున మరోసారి ఆ నష్టం పునరావృతం కాకుండా ఆ ఎనిమిది గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు నిన్న.. చండూరు ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని.. టీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.