మ‌రో హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక చోప్రా!

-

గ్లోబ‌ల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో మ‌రో క్రేజీ ఛాన్స్ కొట్టేసింద‌ని స‌మాచారం. హాలీవుడ్ స్టార్ హీరో ఆంథోని మాకీ తో క‌లిసి ఈ భామ న‌టించ‌డానికి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. కాగ హాలీవుడ్ లో ఎండింగ్ థింగ్స్ అనే సినిమాలో హీరో ఆంథోని మాకీ న‌టిస్తున్నాడు. కాగ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఈ బాలీవుడ్ భామ ను సంప్ర‌దించారని సమాచారం.

అయితే ఇప్ప‌టికే హాలీవుడ్ వ‌రుస సినిమాల‌తో జోరు మీద ఉన్న ప్రియాంక చోప్రా ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఆంథోని మాకీ వంటి స్టార్ హీరోల‌తో హాలీవుడ్ లో న‌టిస్తే.. త‌న క్రేజ్ సైతం పెరుగుతుంద‌ని ప్రియాంక చోప్రా అనుకుందట‌. అయితే ప్రియాంక చోప్రా ఇప్ప‌టికే హాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే హాలీవుడ్ లో ప‌లు సినిమాల‌ను ప్రియాంక చోప్రా చేసింది. ఇటీవ‌ల ది మ్యాట్రిక్స్ రిస‌రేక్షన్స్ అనే సినిమా విడుద‌ల అయి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ప్ర‌స్తుతం సిటాడెల్ అనే అమెజాన్ సిరీస్ లో ప్రియాంక చోప్రా న‌టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news