కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా..? అయితే ఈ ఇబ్బంది తప్పదు..!

-

చాలా మందిలో ఉండే చెడు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి అనేక ఇబ్బందులు కలుగుతాయి. మనం పాటించే పద్ధతుల్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది మంచి ఆహారం తీసుకోవడం మంచి అలవాట్లు కలిగి ఉండడం చాలా అవసరం. ఈరోజుల్లో చాలా మంది ఎక్కువగా కూర్చుని పనిచేస్తున్నారు. ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ స్లో అయిపోతూ ఉంటుంది. ఈ కారణంగా నరాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి.

చాలా మంది ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళల్లో నడుము నొప్పి కాళ్ళు నొప్పులు వంటివి కలుకుతుంటాయి. సో అలా కూర్చుని పని చేసే వారు మధ్య మధ్య లో కాస్త బ్రేక్స్ ని తీసుకుంటూ వుండండి. ఇది ఇలా ఉంటే ఈ చిన్న చిన్న అలవాట్లు ఉండడం వలన కూడా కాళ్లు బలహీనంగా మారతాయి. పాదాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి.

చాలామందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అలవాటు అయితే ఇలా చేయడం వలన మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. పాదాలలో కూడా సమస్యలు వస్తాయి కాబట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం మానుకోవడం మంచిది. వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కానీ అధికంగా వ్యాయామం చేయడం వలన పాదాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వలన మజిల్స్ మీద ప్రెషర్ పడుతుంది. పాదాలలో కాళ్లల్లో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ రెండు వాటికి దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా పాదాలు, కాళ్లు నొప్పి పెడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news