నాలుగు రెట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది : కొదండరాం

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి రేవంత్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నారు.. అందుకే వారిని పిలిచామన్నారు. మన కోసం బలిదానం చేసుకున్న 1200 మంది అమరులను ఎలా చూడాలి.? కేసీఆర్ చేసిన పోరాటం కూడా గొప్పదే అయినా కానీ రాష్ట్రం కోసం చనిపోయిన వారికి ఏం చేసారు.? అని ఆయన ప్రశ్నించారు. ఎనిమిదేళ్ళయినా ఇంకా అమరుల స్మృతి చిహ్నం ఇంకా పూర్తి కాలేదని, తెలంగాణ వచ్చింది ఉపాధి కోసం యువతకు మీరేం చేసారో చెప్పండి.? అని ఆయన వ్యాఖ్యానించారు.

Kodandaram to merge his party with Congress?

అమరుల కుటుంబాలను పరామర్శకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసారని, నిరుద్యోగం కారణంగానే మేము చనిపోతున్నాం అని సూసైడ్ చేసుకున్న వారి లెటర్స్ ఇంకా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కాకపోతే నాకేమైంది అని కేసీఆర్ అంటున్నాడు.. మరి నిరుద్యోగులు ఏం కావాలి.? అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన నిరుద్యోగ యువత చాయ్ అమ్మనుకుంటున్నారు, తోపుడు బండల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది..? నాలుగు రేట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.. అందుకే ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నామని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి.. జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయండి అని అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.. దీనిపై చర్చకు సిద్ధం.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. నియామకాల్లో అవినీతి లేకుండా చూడండని, ఎక్సమ్ పేపర్లలో తప్పులు లేకుండా ఇప్పటి వరకు ఒక్క పేపర్ రాలేదన్నారు. తప్పులు లేకుండా ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ చేయండని, TSPSC కి నా పెన్షన్ నుంచి 10వేలు డొనేషన్ ఇస్తా.. నిరుద్యోగ సమస్యలపైనా రాష్ట్రం అతలాకుతలం అయ్యే ఉద్యమం చేస్తాం.. రాష్ట్రానికి వచ్చిన కంపెనీల లెక్క అంతా తప్పే.. రాష్ట్రంలో యువజన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. నిరుద్యోగం అనేది సామాజిక అణిచివేత.. దానిపై మనం పోరాడాలి.. తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమం కంటే పెద్ద పోరాటం చేయాలనీ. జయశంకర్ సార్ చెప్పారు.. రాష్ట్ర సాధన కంటే అభివృద్ధి కోసం చేసే పోరాటం ఎందుకు క్లిష్టమైందో మా ఇండ్ల తలుపులు పగులగొట్టినప్పుడు అర్థమైంది. అని ఆయన వ్యాఖ్యానించారు.