ఆధార్‌ రేషన్‌ కార్డులా ఇక ప్రాపర్టీ కార్డు…!

-

ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డ్‌, రేషన్‌ కార్డులాగే ఇక ప్రాపర్టీ కార్డు రాబోతోందా ? అందులో వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ ఉండబోతున్నాయా ? ఇంతకీ ఏంటీ ప్రాపర్టీ కార్డు ? గ్రామీణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం.. స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రధాని మోదీ ప్రారంభించారు.

తొలుత యూపీ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు లక్షమంది గ్రామీణ ప్రజలకు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాపర్టీ కార్డుల వల్ల.. బ్యాంకుల్లో రుణాలు పొందడంతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాలకు చెందిన ప్రజలు లబ్ధి పొందనున్నారు. దాదాపు లక్షమంది లబ్దిదారుల మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా లింక్‌ పంపించినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.

ప్రతి ఇంటితో పాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్‌సెంటర్‌, పంచాయతీ కార్యాలయం వంటి అన్ని ఆస్తులను ఈ సర్వేలోకి చేర్చనున్నారు. సరైన దస్తావేజులు లేని కారణంగా తమ సొంత ఇళ్లపై బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపలేని వారికి.. ఈ కార్డుల ద్వారా ఆ లోటు తీర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.

Read more RELATED
Recommended to you

Latest news