నల్లగొండ,రంగారెడ్డి జిల్లాలు వజ్రాల గనిగా మారబోతున్నాయా…?

-

విలువైన ఖనిజాల జాడ మళ్లీ కనిపించిందా? పదేళ్ల క్రితం పరిశోధకులు తేల్చిన సర్వే నిజం కాబోతుందా..రైతుకు దొరికిన వజ్రంపై ల్యాబ్‌లో ఏం తేలింది? రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలానికి చెందిన ఓరైతు పొలంలో భారీ పరిమాణంలో వజ్రం దొరికింది. దీంతో ఆ రైతు గుట్టుచప్పుడు కాకుండా ఆ రాయిని ఓ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో అది వజ్రమేని తేలింది. అంతా బాగానే ఉన్నా దొరికిన వజ్రం ఎక్కడ ఉంది…? వజ్రం ఎవరికి దొరికింది అనేది మాత్రం ఇప్పటికి గోప్యంగానే ఉంది.

శెట్టిపల్లి గ్రామంలో ఎల్లయ్య అనే రైతు పొలంలోనే వజ్రాలు ఉన్నాయని.. గ్రామస్తులంతా ఎల్లయ్య పొలం దగ్గరికి వచ్చి చూస్తుపోతున్నారు. ఎల్లయ్య మాత్రం వజ్రాలు లేవని చెప్పుకొస్తున్నాడు. ఎల్లయ్య కుమారుడు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వజ్రం దొరికిందని.. ఒకవేళ వజ్రాలున్నాయని తెలిస్తే భూమి పోతుందన్న భయంతో రైతు నిజాన్ని దాస్తున్నారని గ్రామస్థులు భావిస్తున్నారు.

మొత్తానికి నల్లగొండ,రంగారెడ్డి జిల్లా కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ గతంలో సర్వేలో తేలిన అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయ్‌. మరి ప్రభుత్వం వజ్రాల నిక్షేపాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news