బ్రిటన్ రాజు.. కింగ్ ఛార్లెస్-3కి నిరసన సెగ తగిలింది. కానీ ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. అదేంటి అనుకుంటున్నారా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. లండన్‌లోని మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న కింగ్ ఛార్లెస్-3 మైనపు విగ్రహాన్ని పర్యావరణ ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జస్ట్ స్టాప్ ఆయిల్ అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టులు ధరించిన ఇద్దరు నిరసనకారులు కింగ్ ఛార్లెస్-3 మైనపు విగ్రహంపై కేక్‌ను పూశారు. ఆ ఇద్దరూ క్వీన్ ఆఫ్ కన్సార్ట్ కెమిల్లా, ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ విగ్రహాల పక్కన ఉన్న కింగ్ చార్లెస్ III మైనపు విగ్రహం వద్దకు వెళ్లారు. ఆయన విగ్రహంపై చాక్లెట్ కేక్ విసిరారు. అంతకు ముందు వారిలో ఒకరు ఒకరు ‘చర్యకు సమయం’ ఇదే అని అరవడం వినిపించింది.
‘‘జస్ట్ స్టాప్ ఆయిల్ ఇద్దరు మద్దతుదారులు కింగ్ చార్లెస్ III మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాంపై చాక్లెట్ కేక్ విసిరి.. కొత్తగా చమురు, గ్యాస్ లైసెన్స్‌లు, అనుమతులను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు’’ అని క్యాంపెయిన్ గ్రూప్ ట్వీట్ చేసింది.
🎂 BREAKING: JUST STOP OIL CAKES THE KING 🎂
👑 Two supporters of Just Stop Oil have covered a Madame Tussauds waxwork model of King Charles III with chocolate cake, demanding that the Government halts all new oil and gas licences and consents.#FreeLouis #FreeJosh #A22Network pic.twitter.com/p0DJ8v3XVB
— Just Stop Oil ⚖️💀🛢 (@JustStop_Oil) October 24, 2022