ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గాంధీజీ 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా వుందన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్. శుభోదయ ట్రస్ట్ ప్రారంభించినప్పటీ నుండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భవనం త్వరలోనే టూరిజంకు ఉపయోగపడనుందని అన్నారు.
అనేక పోరాటాలతో స్వాతంత్ర్యం సాధించారని..స్వాతంత్ర్య పోరాటాలకు మహాత్మా గాంధీ స్పూర్తి అని అన్నారు గవర్నర్.
మహాత్మ గాంధీని ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. జాతీయ జండా రూపకర్త పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఇంటి పై జాతీయ జండాను ఎగురవేసి మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటుదామన్నారు గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం గర్వంగా వుందన్నారు.