ప్రేమలో పడడం చాలా ఈజీ. కానీ ఆ ప్రేమ నిలబెట్టుకోవడం…. అది నిజమైన ప్రేమ అని తెలుసుకోవడం…. కలకాలం ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండడం ఎంత కష్టమో… ఒక్కోసారి సైకో ప్రేమ కూడా ఉండొచ్చు దానిని గుర్తించడం చాలా కష్టం.
ఒకవేళ కనుక ముందుగానే మీరు సైకో ప్రేమని గుర్తిస్తే… ఆ ప్రేమ నుండి బయటపడొచ్చు. జాగ్రత్తగా తప్పించుకోవచ్చు. నిపుణుల ప్రకారం కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని సైకోలుగా గుర్తించి మనం ముందే జాగ్రత్త పడొచ్చు. మరి ఎలా మనం ఆ ప్రేమని గుర్తించి తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం.
ఈ విధంగా టార్చర్ పెట్టడం:
ప్రేమ అంటూ వేధించడం
అమ్మాయి మీద ఆసిడ్ పోయడం
ట్రాప్ చేయడం
ఎదుట వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆనందపడటం
ప్రేమ పేరుతో హత్య చేయడం ఇటువంటివి సైకో ప్రేమ లోనే ఉంటాయి.
ఎమోషన్స్ ఉన్నట్టు నటించడం:
ప్రేమించిన వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ఎమోషన్స్ ఉన్నట్లు నటిస్తారు చాలామంది. అలానే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతారు. జాలి కలిగేలా కథలు చెప్తూ ఉంటారు.. ఇవి సైకో ప్రేమకి లక్షణాలు.
అతిగా పొగడడం:
కొంతమంది అతిగా పొగుడుతూ ఉంటారు అది కూడా సైకో ప్రేమకి లక్షణమే. ఇలా ఎక్కువగా పొగిడే వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించి ఆ ప్రేమ నుండి బయటపడండి లేకపోతే భవిష్యత్తులో మీకే కష్టమవుతుంది.
చాలా తక్కువ రోజులు రిలేషన్ షిప్ లో ఉండడం:
వీళ్ళు ప్రేమలో పడతారు వెంటనే బ్రేకప్ అని అంటారు మళ్లీ ప్రేమలో పడతారు మళ్ళీ బ్రేకప్ అని చెప్తారు. ఇది కూడా సైకో ప్రేమకి లక్షణం.
ఎదుట వారి మధ్య డ్రామాలని క్రియేట్ చేస్తారు:
సాధారణంగా ఇద్దరు ప్రేమికుల మధ్య విషయాలు మూడో వ్యక్తికి తెలియక్కర్లేదు కానీ సైకో ప్రేమికులు మాత్రం చీటికిమాటికి మరొక వ్యక్తికి వారి మధ్య జరిగే విషయాలని తీసుకొస్తారు వేరే వాళ్ళ దగ్గర మనల్ని చీప్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సైకో ప్రేమలో కనపడతాయి. బాధ్యత తీసుకోకపోవడం అహంకారం ఇవి కూడా సైకో ప్రేమలో ఉంటాయి.