సీట్లు తేల్చేస్తున్న లోకేష్..టీడీపీకి ప్లస్సేనా!

-

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టి‌డి‌పి పనిచేస్తుంది..గత ఎన్నికల్లో దారుణ ఓటమికి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని టి‌డి‌పి కష్టపడుతుంది. తమకు అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వైసీపీపై పోరాడుతుంది. అటు అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతూనే..పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు నారా లోకేష్ తన పాదయాత్ర ద్వారా పార్టీ బలాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇదే సమయంలో గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించకుండా..ముందు నుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకునే రావడమే లక్ష్యంగా చంద్రబాబు వస్తున్నారు.

ఇప్పటికే చాలా సీట్లలో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..తాను పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి అభ్యర్ధులని ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే లోకేష్ వరుసపెట్టి అభ్యర్ధులని ఖరారు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వరుసపెట్టి అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్నారు.

ఇటీవల ఆయన శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, సత్యవేడు, చంద్రగిరి స్థానాల్లో పాదయాత్ర చేస్తే..ఇప్పటికే కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయడం ఖాయమే. ఇటు కాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని లోకేష్ ఫిక్స్ చేశారు. అలాగే పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. ఇక సత్యవేడులో హెలెన్ పోటీ చేస్తారని చెప్పారు.

ఇక నగరిలో గాలి భాను ప్రకాష్, చంద్రగిరిలో పులివర్తి నాని పోటీ చేస్తారని ప్రకటించారు. జిల్లాలో ఇంకా పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో దిగనున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లాలో పలు సీట్లని లోకేష్ ఫిక్స్ చేశారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే లోకేష్ సీట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news