ఆంధ్రప్రదేశ్ లో ఆక్సీజన్ కొరత అనేది తీవ్ర స్థాయిలో ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆక్సీజన్ కొరత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇక రాష్ట్రంలో ఇటీవల కొన్ని ఆస్పత్రుల్లో మరణాలు కూడా సంభవించాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ లెక్కలు అబద్దం అని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. 50 మంది మృతి చెందితే 11 మందేనని ప్రభుత్వం పేర్కొనటంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి మరణాలను గోప్యంగా ఉంచుతున్నారని పిటిషనర్ జీబీపీ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వేసవి సెలవు అనంతరం ఈ అంశంపై కోర్ట్ లో విచారణ జరుగుతుంది.