రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటి నుంచో ఓ ఎమ్మెల్యే పోరాడుతోంది. ఇప్పుడే కాదు గతేడాది కూడా తన నియోజకవర్గంలో అడవిలో నడచుకుంటూ వెళ్లి పేదోళ్లకు సరుకులు పంపిణీ చేసింది. పార్టీతో సంబంధం లేకుండా ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. పేదోళ్ల పెన్నిధి అని అందరూ ఆమెను కొలుస్తారు. ఆమెనే ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఇప్పుడు ఆమె టీఆర్ ఎస్ సర్కారుకు మరో సవాల్ విసిరింది. రాష్ట్రంలో కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఎప్పటి నుంచో సీతక్క ఉద్యమం చేస్తోంది. కానీ దానిపై టీఆర్ ఎస్ పెద్దగా స్పందించలేదు. పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఈ మాటలపై సీతక్క హాట్ కామెంట్స్ చేసింది. వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెండుగా ఉంటే మంత్రులు, సీఎం ఎందుకు ప్రయివేటు ఆస్పత్రిలో చూపించుకున్నారంటూ విమర్శించారు. ఏ హాస్పిటల్లో సిటీ స్కానింగ్ సెంటర్లు, ఇతర మౌళిక సదుపాయాలు ఉన్నాయో చూపించాలంటూ సవాల్ విసిరారు. లేదంటే ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరి ఈ సవాల్‌ను టీఆర్ ఎస్ స్వీకరిస్తుందోలేదో చూడాలి.