ఈ మధ్య కాలం లో చాలా మంది స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. వాటి ద్వారా ఆర్ధిక సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. అయితే మీరు కూడా స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో కానీ సుకన్య సమృద్ధి యోజన పథకంలో కానీ డబ్బులు పెడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్.
ఇలా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టే వాళ్లకి కేంద్రం ఓ మంచి విషయం చెప్పింది. అదేమిటంటే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్టు చెప్పింది. మార్చి నెల చివరి వరకు ఇదే వడ్డీ రేట్లు వుండనున్నాయి. ఇది పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునే వాళ్లకి రిలీఫ్ ని ఇచ్చింది. మాములుగా అయితే ప్రతీ మూడు నెలలకి ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
వడ్డీ రేట్లను పెంచొచ్చు. లేదంటే తగ్గించొచ్చు. లేదంటే స్థిరంగా కొనసాగించొచ్చు. అయితే ఇప్పుడు సుకన్య సమృద్ధి స్కీమ్, పీపీఎఫ్ వంటి వాటికి మాత్రమే కాకుండా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కూడా ఇదే వర్తిస్తుంది. కనుక ఏ ఇబ్బంది లేదు. టైమ్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలైన స్కీమ్స్ అన్నీ కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏ.
వీటిలో డబ్బులు పెట్టే వాళ్ళు కచ్చితంగా వడ్డీ రెట్లని గమనిస్తూ ఉండాలి. ఇక ఏ స్కీమ్ కి ఎంత వడ్డీ వస్తోంది అనేది చూస్తే.. సుకన్య సమృద్ధి స్కీమ్‌పై 7.6 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 6.8 శాతం, కిసాన్ వికాస్ పత్ర పథకంపై 6.9 శాతం వడ్డీ వస్తోంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తోంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 6.6 శాతం, టైమ్ డిపాజిట్‌పై 6.7 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం వడ్డీ వస్తోంది.