పంక్య్చువాలిటీ! సాధారణంగా వ్యక్తులకు మాత్రమే అన్వయం అయ్యే ఈ పదం.. వ్యవస్థలకు అన్వయం అవుతుందా? వ‌్యవస్థల ను అనుకున్న విధంగా అనుకున్న సమయానికి ముందుకు నడిపించడం సాధ్యమేనా? అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమం పూర్తిచేయడం.. అంటే.. కుదిరేనా? వ‌్యక్తులుగా మనమే సాధించలేంది.. వ్యవస్థలుగా ఉన్న ప్రభుత్వాలు చేసేనా?
ఇప్పటి వరకు ఉన్న అనుభవాలను చూస్తే.. సాధ్యం కాదనే చెప్పాలి. ఏదైనా ప్రభుత్వానికి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే.. అది ఎప్పటికి క్లియర్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అసలు సదరు పథకం అమలవుతుందో.. అమలైనా.. పెట్టుకున్న వారికి వస్తుందో.. రాదో కూడా తెలియని పరిస్థితి! జవాబు దారీ తనంలేని ప్రభుత్వాలు రాజ్యమేలిన కాలంలో ఇలాంటి దుస్థితే కొనసాగింది.
అంతేందుకు.. నేను పనిరాక్షసుడిని అని చెప్పుకొన్న చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వం నుంచి లబ్ధి దారులకు ఏదైనా అందా లంటే.. అది ఎప్పుడు అందుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎవరికి అందుతుందో కూడా చెప్పలేని దుస్థితి. అంతేకాదు, ఎవరు లబ్ధిదారులో కూడా తెలియని పరిస్థితి. దీంతో అప్పట్లో ఇళ్ల కోసం పెట్టుకున్న పేదలకు ఇప్పటి వరకు న్యాయం జరిగిన సందర్భా లు లేవు. అలాంటి దౌర్భాగ్యకరమైన వ్యవస్థను మార్చేందుకు ఇప్పటి వరకు ఎవరైనా ప్రయత్నించారంటే.. అది నిజంగా ప్రస్తుత సీఎం జగన్‌కే ఉందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం అంటే.. పథకాలు ప్రకటించడమే కాదని, ఆయా పథకాలను నిర్దిష్ట కాలావధి లో ప్రజలకు అందించాలనే చిత్తశుద్ధిని జగన్ ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఏడాది పూర్తయిన పాలన నేపథ్యంలో ఆయన తాను ప్రవేశ పెట్టిన కొత్త పథకాలను నిర్దిష్ట సమయంలోనే ప్రజలకు అందించే పంక్చ్యువాలిటీ వ్యవస్థను తీసుకువచ్చారు. వాస్తవానికి ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకుంటే. అది ఎప్పటికి సాకారం అవుతుందో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు జగన్ ఖచ్చితంగా ఓ పంక్చ్యువల్‌గా అమలు చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దారు.
దీనికి సంబంధించిన వ్యవస్థను మంగళవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగన్ పై అధికారులు ప్రశ్నలు గుప్పించారు. ఇలాంటి టైంబౌండ్ పాలన కేంద్రంలోనూ సాగడం లేదుసార్.. గతంలో కమ్యూనిస్టు పాలన సాగిన పశ్చిమ బెంగాల్‌లోనూ సాగలేదని వివరించారు. కానీ, జగన్ మాత్రం ఎక్కడో సాగలేదని మనం ఎందుకు మౌనంగా ఉండాలి..? మన దగ్గర ఎందుకు టైం ప్రకారం సాగకూడదని ఎదురు ప్రశ్నించడంతోపాటు.. ప్రజలకు నిర్ణీత సమయానికి సేవలు అందించడం ద్వారా వారి మనసులో చోటు సంపాయించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తంగా ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.