2019 లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. అప్పటినుండి ఎంతో మంది నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. చంద్రబాబు తర్వాత ఆ పార్టీని నడిపించే సత్తా గల నాయుకుడు ఎవరున్నారు అంటూ తెలుగు తమ్ముళ్ళు ఆలోచనలో పడ్డారు. కొంతమంది బాబు తర్వాత లోకేష్ పార్టీని నడిపిస్తాడు అని చెప్తున్నారు. చంద్రబాబు కూడా దానికే ప్రాణాళిక సిద్ధం చేస్తున్నాడు. మరి కొందరు నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నడిపే సత్తా లోకేష్ కి లేదని, ఏదో తండ్రి దయతో ఎమ్మెల్సీ గా ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన అనుభవం తప్ప.. లోకేష్ కు వేరే ఏ అనుభవం లేదని. పైగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాడు పార్టీని ఏం నడిపిస్తాడాని కొందరు బహిరంగంగానే చెప్తున్న మాట. ఇదే మాటని వైసీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి.
అయితే నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ లోకేశ్ నాయకత్వ సమర్ధతపై వస్తున్న విమర్శలపై స్పందించారు. టీడీపీని ముందుకు నడిపించే విషయంలో నారా లోకేశ్ సమర్ధుడు అని, ఉన్నత విద్యను అభ్యసించిన లోకేశ్‌కు అనేక అంశాలపై అవగాహన ఉందని, నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని తేల్చి చెప్పారు.