పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స చేయిస్తున్నారు. కడుపు నొప్పి రావడంతో భగవంత్ మాన్‌ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. భగవంత్ సింగ్ మాన్ కడుపులో ఇన్‌ఫెక్షన్ సోకిందని వెల్లడించారు.
ఆస్పత్రిలో చేరిన తర్వాతనే సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, ఇటీవలే భగవంత్ సింగ్ మాన్ రెండో వివాహం చేసుకున్నారు. తన దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్ (32 ఏళ్లు)ను వివాహం చేసుకున్నారు. కాగా, బుధవారం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పందించారు. ఈ మేరకు పోలీసులకు అభినందనలు తెలియజేశాడు.