బీజేపీ, జనసేన పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి

-

ఏపీలో పొత్తుల రాజకీయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన పొత్తులపై నిన్న పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖలపై తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని పురంధేశ్వరి వెల్లడించారు. అయితే సమన్వయ లోపం మాత్రం లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు పురంధేశ్వరి. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామని ఆమె అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మున్నెన్నడు లేనివిధంగా పురోగతి సాధిస్తుందని పురంధేశ్వరి తెలిపారు. పేదల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారు పురంధేశ్వరి. కరోనా సమయంలో ప్రజలకు ఉచిత రేషన్ అందించామన్నారు.

Will stay in BJP: NTR's daughter Daggubati Purandeswari after husband meets  Jagan | The News Minute

ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇతోదికంగా సహాయం చేస్తుందని తెలిపారు పురంధేశ్వరి. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ – జనసేన కూటమికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కొత్త కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news