గతంలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చూశాము. ఈ సినిమాతో ఒక్కారిగా రామ్ మరియు పురు జగన్నాథ్ ల కెరీర్ లో ప్రాణం వచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాలు పెట్టుకుని తీసిన సినిమా లైగర్ దారుణమైన ఫలితాన్ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో పూరి చాలా కష్టాలలో కూరుకు పోయాడు. ఈ సినిమా వలన ఎన్నో వివాదాలలో కూడా ఇరుక్కున్నాడు. కాగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పూరి జగన్నాథ్ మళ్లీ రామ్ తోనే సినిమా తీసి హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డబుల్ ఇస్మార్టు 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా పూరి నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూలై 9 వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నాడట. జూలై 12 నుండి షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ను కూడా మొదలు పెట్టనున్నాడని అధికారిక సమాచారం.
పూరి జగన్నాథ్ “డబుల్ ఇస్మార్ట్ 2” కు ముహూర్తం ఫిక్స్… !
-