పూరికి ‘లైగర్’ దెబ్బ.. ‘ఇస్మార్ట్ శంకర్-2’ కు సిద్ధం !

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్ తో రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్ఠించిన సంగతి తెలిసందే. ఈ సినిమా రామ్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంతేకాదు 2019 లో రిలీజై భారీగా లాభాలను తీసుకొచ్చిన సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది. అందుకు కారణం ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడమే.

ఇది ఇలా ఉండగా.. లైగర్‌ ఫ్లాప్‌ దెబ్బకు పూరి… సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్‌. ముంబైలో కొత్త స్క్రిప్టు రాసే పనిలో పూరి జగన్నాథ్‌ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ కొత్త స్క్రిప్టు ఇస్మార్ట్ శంకర్ 2 కోసమే అయి ఉండొచ్చనే ఊహాగానాలొస్తున్నాయి. పూరికి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్.. మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మాసివ్‌ సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ సినిమా రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందుకే గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news