ఇటీవల ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగ ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ 70 స్థానాలకు గానూ.. 47 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి ఏకైకా అతి పెద్ద పార్టీగా నిలిచింది. దీంతో బీజేపీ ఉత్తరా ఖండ్ లో వరుసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగ ఈ సారి కూడా ఉత్తరా ఖండ్ ముఖ్యమంత్రి బాధ్యతలను మళ్లీ పుష్కర్ సింగ్ ధామి చేపట్టనున్నారు. ఈ రోజు ఉత్తరా ఖండ్ బీజేపీఎల్పీ డెహ్రాడూన్ లో సమావేశం అయింది.
ఈ సమావేశంలో పుష్కర్ సింగ్ ను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారు. కాగ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ఓటమి పాలైయ్యారు. కాగ సీఎం అభ్యర్థి ఓడిపోవడంతో తర్వాతి సీఎం ఎవరూ అనే చర్చ ఉత్తరా ఖండ్ లో జోరుగా సాగింది. అలాగే ముఖ్య మంత్రి రేసులో పష్కర్ సింగ్ తో పాటు మరో నలుగురు కీలక నేతలు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోయిన పుష్కర్ సింగ్ కే మొగ్గు చూపారు. దీంతో పుష్కర్ సింగ్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి.