గొర్రెలు, మేకలలో… కాలి పుల్ల రోగం లక్షణాలు, కారణాలు

-

ఊర్లల్లో గొర్రెలు, మేకలు పెంచుతారు కానీ.. వాటి శుభ్రత రైతులు పెద్దగా దృష్టిపెట్టరు. ఎంతసేపు అవసరమైన ఆహారం, నీరు అందించడమే తప్ప.. వాటిని క్లీన్ చేసేంత టైం ఉండదు. గేదలు అయితే..అ‌వి బయటకు వెళ్తే బురదలో పడుకుంటాయి కాబట్టి తప్పక క్లీన్ చేస్తుంటారు. గొర్రెలు, మేకల్లో కాలిపుర్ల రోగం ఎక్కువగా ఉంటుంది. ఫుట్ రాట్ లేదా ఇన్ఫెక్షియస్ పోడోడెర్మాటిటిస్ అని పిలుస్తారు. ఈరోజు మనం దీన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

కాలిగిట్టలలో కలిగే ఒకరమైన ఇన్ఫెక్షన్ ఇది.. జంతువు పాదం నుండి పైకి కుళ్ళిపోతుంది. జంతువు రెండు కాళ్ల మధ్య ప్రాంతంలో ఈ వ్యాధి వస్తుంది. పశువులకు నడుస్తున్న సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.. ఇది ఒక జంతువు నుండి మరొక జంతువుకి కూడా సోకుతుంది. జంతువు జీర్ణాశయంలో, మలంలాండ్ బాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

జంతువుల డెక్కలు లేదా పంజాల మధ్య చర్మం ఉబ్బడం ప్రారంభమవుతుంది.
డెక్కల మధ్య విపరీతంగా వాపు వస్తుంది.
కాలి వేళ్ళ మధ్య చర్మం ఎర్రగా మారుతుంది.
జంతువు శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఈ వ్యాధి ముదిరి తీవ్ర దశలో సోకిన భాగం వెంట పగుళ్లు ఏర్పడతాయి.
వాపుల కారణంగా కాలి వేళ్లు విడిపోవచ్చు.
కుళ్లిపోవడం వల్ల పాదాల నుండి దుర్వాసన వస్తుంది.
ఇది గమనించిన వెంటనే మందులతో చికిత్స చేయాలి. చికిత్స చేయకపోతే, మొత్తం మందకు వ్యాధి వ్యాపిస్తుంది.

పాదం కుళ్ళిపోవడానికి మరొక కారణం అధిక ఉష్ణోగ్రతలు లేదా తేమకూడా అయి ఉండొచ్చు అంటున్నారు పశు వైద్య నిపుణులు. దీని వలన కాళ్ళ మధ్య చర్మం పగుళ్లు ఏర్పడి, బ్యాక్టీరియా పాదాలకు సోకుతుంది. వేసవిలో పాదాల తెగులు ప్రధాన సమస్యగా మారడానికి ఇది ఒక కారణం. ఇది పశువులు , గొర్రెలలో వచ్చినా వ్యాధి భిన్నంగా ఉంటుంది. డెక్కను కత్తిరించకుండా లేదా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం మంచిది.

పశువులు ఈ వ్యాధి భారిన పడుకుండా ఉండాలంటే.. పశువుల మంద ఉండే ప్రాంతాన్ని, పశువులను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. గొర్రెల మంద ఎప్పుడూ ఒకేసారి ఉంటాయి కాబట్టి.. ఒక్క గొర్రెకు ఏదైనా వ్యాధిసోకినా..అది మొత్తం మందకు వ్యాపిస్తుంది.గొర్రెలు, మేకల్లో ఏదైనా వ్యాధి భారిన పడితే.. దాన్ని వేరుగా ఉంచుతూ చికిత్స అందించాలి.

Read more RELATED
Recommended to you

Latest news