పుష్ప నుంచి డిలీటెడ్ సీన్… సూపర్ గా ఉందంటున్న ఫ్యాన్స్.. లక్షల్లో వ్యూస్.

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల కొల్లగొడుతోంది. ఊర మాస్ క్యారెక్టర్ లో ఎర్రచందనం స్మగ్లర్ రోల్ లో బన్నీ ఇరగదీశాడు. మరో వైపు డీగ్లామరస్ రోల్ లో రష్మికా మందన్న అదరగొట్టారు. బన్నీ కెరీర్ లోనే తొలి ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కింది. తెలుగు, మళయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప విడుదలై మంచి వసూసళ్లను సాధించింది.

అన్నింటి కన్నా ముఖ్యంగా సినిమా రిలీజ్ కు ముందే నుంచి అంచానాలు పెరిగాయి. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్, సమంత ఐటెం సాంగ్ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే తాజగా పుష్ప మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. అయితే సీన్ అంత బాగున్నా.. ఎందుకు తీసేశారని ఆడియన్స్, ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ సీన్ లో అప్పు తీర్చాలని.. పుష్ప తల్లిని అప్పు ఇచ్చిన వ్యక్తి అడగుతుంటాడు. రేషన్ సరుకులు ఇచ్చే సమయంలో అందరి ముందు పుష్ప తల్లితో తిడుతూ మాట్లాడుతుంటాడు. దీంతో పుష్ప పశువును అమ్మి సదురు వ్యక్తి అప్పు తీరుస్తాడు. అయితే అప్పు తీర్చే క్రమంలో బాకీ ఇంకా తీరలేదని… నిన్న అందరి ముందు అవమాన పరుస్తూ మాట్లాడనవి.. ఇప్పుడు అందరి ముందు నేను బాకీ తీర్చానిన తెలియాలంటూ.. ఇంటింటికి వెళ్లి చెప్పించే సీన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సీన్ యూట్యూబ్ లో విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే 8 లక్షల వ్యూస్ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news