లిఫ్ట్‌ లో ఇరుక్కుపోయిన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌..వీడియో వైరల్‌

-

ఆసీస్‌ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కు ఓ వింత సంఘటన ఎదురైంది. ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌ లో ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌ హోటల్‌ లోన ఓ లిఫ్ట్‌ లో ఇరుక్కు పోయాడు. దాదాపు గంట సేపు లిఫ్టు పనిచేయకపోవడం కారణంగా అందులోనే ఉండి పోయాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్‌ స్మిత్‌.. తన సోషల్ మీడియా వేదికగా.. తెలిపాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మెల్‌ బోర్న్‌ పార్క్‌ హయాత్‌ హోటల్‌ లో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్నారు. ఈ తరుణంలోనే.. ఓ పని మీద లిఫ్ట్‌ ఉపయోగించుకున్న క్రమంలో అది కాస్తా పని చేయకుండా పోయింది. దీంతో 55 నిమిషాల పాటు లిఫ్ట్‌ లోనే ఇరుక్కు పోయాడు స్టీవ్‌ స్మిత్‌. ఆ సమయంలోనే లబుషేన్‌ డోర్ల గ్యాప్‌ లోంచి అతడికి జెమ్స్‌ ఇచ్చాడు. వాటిని తింటూ ఫోన్‌ తో కాలక్షేపం చేశాడు స్టీవ్‌ స్మిత్‌. టెక్నీషియన్‌ వచ్చి మరమ్మత్తులు చేశాక అతడు బయటకు వచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news