వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

-

వస్త్ర పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇవాళ జీఎస్టీ కౌన్సిల్‌ 46 వ సమావేశం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో… ఉదయం ప్రారంభమైంది. వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని ఈ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా వేసుకుంది. వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతి పాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్‌.

టెక్స్‌టైల్స్‌ పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1 వ తేదీ నుంచి అమలు లోకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దీంతో వస్త్ర పరిశ్రమకు కాస్త ఊరట లభించింది. ఇక ఈ వివాదం పై నిన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా కేంద్రా నికి లేఖ రాశారు. అటు.. విపక్షాలు కూడా దీనిపై పట్టుబడుతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news