కేజిఎఫ్ స్ట్రాటజీ ను ఫాలో అవుతున్న పుష్ప..!!

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమా ఇద్దరూ పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళి పోయారు. అల్లు అర్జున్ స్టయిల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం పిధా అయ్యింది. ఇప్పుడు అందరూ రెండొ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తున్నాయి.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దానికి కారణం స్క్రిప్ట్ లో మార్పుల కోసం ఆగడమే. పుష్ప మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్నినమోదు చేసింది. దీనితో సుకుమార్ లో ఒత్తిడి బాగా పెరిగిందట. దానితో సుక్కు బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కు స్క్రిప్టు వర్క్ ఎలా చేంజ్ చేశారు, అలాగే KGF 1 తర్వాత kgf 2 కోసం ఎలాంటి మార్పులు చేశారు అనేది తన టీమ్ తో చర్చించాడట.

Allu-Arjun
Allu-Arjun

ఫైనల్ గా KGF ను ఫాలో కావాలని నిర్ణయించు కున్నారట. ఎందుకంటే బహుబలి కంటే KGF లోనే ఒక పేదరికం లో వున్న కుర్రాడు ఉన్నత స్థానంలోకి ఎలా ఎదిగాడు అనే పుష్ప సినిమా కు చెందిన సిమిలారిటీ వుంది. దీనితో దానిలోని ఎమోషన్, యాక్షన్ ను పట్టుకొని తన దైన శైలిలో స్క్రీన్ ప్లే తో మాయ చేయబోతున్నాడట. అలాగే షూటింగు ను మారేడుమిల్లితో పాటు బ్యాంకాక్ అడవుల్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయబోతున్నారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news