రష్యా ఆధీనంలోకి డాన్‌బాస్.. తగ్గేదెలే అంటున్న పుతిన్!

-

డాన్‌బాస్ ప్రాంతానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పిన రష్యా అధ్యక్షుడు.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డాన్‌బాస్ ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చియని పుతిన్ తెలిపారు. పోరాటంలో పాల్గొన్న బలగాలు విజయం సాధించినట్లు పేర్కొన్నాయి. అయితే యుద్ధంలో ఓడిపోయినా.. మరోసారి పోరాటం చేస్తామని ఉక్రెయిన్ సైనికులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాగా, సోమవారం జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్

రష్యా-ఉక్రెయిన్ దాడులపై స్థానికుల పౌరులతోపాటు కొందరు సైనికులు సైతం తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. భయం.. భయంతో బతకాల్సి వస్తోందని, నరకం చూస్తున్నామని కొందరు సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ సైనికులు విశ్వసిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ పునఃనిర్మాణానికి ప్రపంచ దేశాలు సహాయపడాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. తమ దేశాన్ని పునఃనిర్మించుకోవడానికి రూ.60 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news