వేసివిలో ఐస్ క్యూబ్స్ మోఖానికి పెట్టేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

-

ఎండకు తట్టుకోలేక.. చాలామంది ఇళ్లల్లో ఐస్ క్యూబ్స్ ను ముఖానికి రుద్దుకుంటారు. దీంతో ఆ క్షణం మంచి ఫ్రష్ ఫీల్ వస్తుంది. అయితే ఇంట్లో వాళ్లు మనం అలా చేస్తుంటే..వద్దు అంటారు. రుద్దుకుంటే ఫేస్ పాడవవుతుంది అంటారు. అసలు ఐస్ క్యూబ్స్ ను ఫేస్ కు అప్లై చేయొచ్చా.. చేస్తే ఎలా చేయాలి..? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం.

 

వేడికి చర్మం ఎరుపుగా మారడం, అలెర్జీలు, దురద సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చక్కగా పనిచేస్తుంది. ముఖంపైన ఉండే రంధ్రాలు శుభ్రమవుతాయి. వాటి పరిమాణం తగ్గిపోతుంది. వీటి పరిమాణం పెరిగితే చర్మ సౌందర్యం తగ్గుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఐస్ క్యూబ్స్ ను సున్నితంగా ముఖంపై రుద్దడం, నెమ్మదిగా మసాజ్ చేయడం వలన రక్తప్రసరణ పెరుగుతుంది. ఐస్ క్యూబ్స్ ఫేషియల్ మొటిమలను తగ్గిస్తుంది. చర్మం తేమను నిలుపుతుంది. దీంతోపాటు.. వేడి వాతావరణంలో వచ్చే జిడ్డు చర్మం సమస్య కూడా తగ్గుతుంది.

ఐస్ క్యూబ్స్ ఫేషియల్ ఎలా చేయాలంటే..

ముందుగా మీ ముఖాన్ని తేలికపాటి ఫేస్‏వాష్‏తో కడగాలి. దీంతో చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళీ క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ ను మెత్తని క్లాత్ లో చుట్టి చర్మంపై రుద్దాలి. మంచు కరిగినప్పుడు ఆ క్లాత్ తో తుడవాలి.

ఆ తర్వాత ఐస్ ప్యాక్ తీసుకుని చర్మంపై 1-2 నిమిషాలు ఉంచాలి. రోజ్ వాటర్, గ్రీన్ టీతోపాటు ఐస్ క్యూబ్స్ కలిపి ఫేషియల్ చేస్తే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది..

డైరెక్టుగా ఐస్ ప్యాక్స్ ను ఫైస్ కు అప్లై చేయకూడదు. దీనివల్ల.. ఫేస్ కందిపోతుంది. అందుకే.. వాటిని క్లాత్ వేసి స్మూత్ గా మసాజ్ చేయాలి. కొందరికి స్కిన్ ఉబ్బిపోయి, డల్ గా అవుతుంది. అప్పుడు కూడా నాలుగు ఐదు ఐస్ క్యూబ్స్ ను ఒక పెద్ద బౌల్లో వేసి నీళ్లు పోసి.. ముఖం అందులో ఉంచాలి. 3 4 సెకండ్లు అలా ఉంచి. మళ్లీ తీసి మళ్లీ ఉంచాలి. ఇలా మూడు సార్లు చేస్తే.. ముఖం ఉబ్బినట్లు ఉండదు. ఫ్రష్ గా అవుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news