Shocking News : మహిళను మింగేసిన భారీ కొండచిలువ

-

ఇండోనేషియాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన ఓ మహిళను 22 అడుగులున్న భారీ కొండచిలువ మింగేసింది. జాంబి ప్రావిన్స్‌కు చెందిన 54 ఏళ్ల జారా అనే మహిళ రబ్బర్‌ ఏరేందుకు అడవిలోకి వెళ్లింది. రెండు రోజులైనా ఆమె జాడ కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు అడవిలో గాలించారు.

అడవిలో ఓ చోట ఆమె చెప్పులు, కత్తి ఇతర వస్తువులు కనిపించాయి. అయినా ఆమె జాడ కనిపించకపోవడంతో ఏ మృగమైనా ఆమెపై దాడి చేసిందేమోనన్న అనుమానంతో కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్థులు, అధికారులు అడవిలో గాలింపు చేపట్టగా ఓ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించింది. దాని కడుపు ఉబ్బి ఉండటం గమనించారు అధికారులు.

అదృశ్యమైన జారాను కొండచిలువే మింగేసి ఉంటుందని భావించారు. గ్రామస్థులంతా కలిసి దానిని చంపి పొట్టను చీల్చి.. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. జారాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news