ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి తినేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపరు. తక్కువ ధరకు వస్తాయని చీప్‌గా తీసి పడేస్తారు. ఆకుకూరల్లో ఉన్నన్ని పోషకాలు వేరే ఏ కూరగాయల్లో కూడా ఉండవు. మనకు తెలిసిన ఆకుకూరలు కొన్నే..తెలియనివి చాలానే ఉన్నాయి..చెన్నంగి ఆకు గురించి ఎప్పుడైనా విన్నారా..? తెలంగాణ ప్రజలకు అయితే బాగా తెలుస్తుంది. ఈ ఆకుకూర వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..!
చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు..! జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి ఏదీ తినాలనిపించదు. ఏదీ తిన్నా కూడా నాలుకకు సహించదు..నోరంతా రుచిలేకుండా ఉంటుంది. ఇలాంటి సమస్యను చెన్నంగి ఆకు కూరతో చేసే పచ్చడి పొగోడుతుంది. చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. చెన్నంగి ఆకులలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడీ నొప్పులను తగ్గిస్తుంది.
ఎన్నో ఔషధ గుణాలున్న చెన్నంగిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు..చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ చెట్టులో ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది. వాతాన్ని, విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది. గాయాలను, వ్రణాలను, చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.
కసివింద గింజలను దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కషాయంలా చేసుకుని అందులో తగినన్ని పాలు, కండచక్కెర కలిపి కాఫీ లా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది.
కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజూ మర్దనా చేయడం వల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి.
కసివింద ఆకులను, వేరు బెరడును ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడికి తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి.