వైసీపీ గర్జన..బాబు-పవన్‌ టార్గెట్..!

-

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానుల బిల్లుని పెట్టడం, బిల్లులో తప్పులో ఉండటం, హైకోర్టు కొట్టేయడంతో బిల్లు వెనక్కి  తీసుకున్నారు..మళ్ళీ కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. అయితే మూడేళ్ళ నుంచి అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం చేస్తున్నారు..ఇదే క్రమంలో అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారు.

ఈ పాదయాత్ర మొదలుపెట్టిన వెంటనే..విశాఖ పరిపాలన రాజధాని అనే నినాదంతో వైసీపీ పోరాటం మొదలుపెట్టింది. ఉత్తరాంధ్రకు టీడీపీ ద్రోహం చేస్తుందని, అమరావతి పాదయాత్రని ఉత్తరాంధ్రలో ఎంటర్ కానివ్వమని, అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు మాట్లాడారు. ఇక విశాఖ రాజధాని పేరుతో..తాజాగా విశాఖ గర్జన పెట్టారు. పేరుకు నాన్ పోలిటికల్ జే‌ఏ‌సి పేరుతో ర్యాలీ నిర్వహించిన..ఇది పూర్తిగా వైసీపీ గర్జనగానే మారింది. అలాగే ఈ గర్జనలో పాల్గొనాలని అధికారులు, వాలంటీర్ల ద్వారా ప్రజలకు సందేశాలు కూడా వెళ్ళాయి. ఖచ్చితంగా గర్జనకు హాజరు కావాలని, కాలేజ్, స్కూల్ పిల్లలు కూడా పాల్గొనాలని ఆదేశించినట్లు కూడా తెలిసింది.

సరే ఏదొకటి జనం ఎలా వచ్చారనేది పక్కన పెడితే…మొత్తానికి వర్షంలో కూడా విశాఖ గర్జన ర్యాలీ భారీగానే జరిగింది. అయితే ఈ గర్జన సందర్భంగా వైసీపీ నేతలు పూర్తిగా చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడారు. చంద్రబాబు-పవన్‌లపై విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన..టీడీపీ అనుకూల మీడియా సంస్థలపై విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఇది విశాఖ రాజధాని అవ్వాలనే సభ కానీ..అది పూర్తిగా చంద్రబాబు, పవన్‌ని తిట్టడానికే గర్జన చేసినట్లుగా ఉందనేలా పరిస్తితి వచ్చింది.

అదేమంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం బాబు-పవన్‌కు ఇష్టం లేదని..ఉత్తరాంధ్ర ప్రజల్లో ఓ సెంటిమెంట్ లేపి..టీడీపీ-జనసేనలని దెబ్బకొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనే కాన్సెప్ట్‌లో వైసీపీ గర్జన చేసిందని చెప్పొచ్చు. మరి వైసీపీ గర్జనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news