కశ్మీర్‌ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం

-

ఏడో తరగతి ప్రశ్నాపత్రంలో రూపొందించిన ఓ ప్రశ్న దేశంలో దుమారం రేపుతోంది. కశ్మీర్​ మన దేశంలో భాగం కాదన్నట్లు ఓ పరీక్షలో అడిగిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎడ్యుకేషన్​ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బిహార్​ కృష్ణగంజ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో ఏడో తరగతి విద్యార్థులకు ఓ విస్తుపోయే ప్రశ్న ఎదురైంది. ‘చైనా, నేపాల్, ఇంగ్లండ్, కశ్మీర్​, భారత్​లోని ప్రజలను ఏమని పిలుస్తారు?’ అంటూ ప్రశ్న అడిగారు. అన్నీ దేశాల పేర్లు ఉండగా.. కశ్మీర్​ను కూడా అందులో భాగం చేసి కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారని అడగం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కశ్మీర్​ భారత్​లో భాగం కాదని అదొక ప్రత్యేక దేశమనేలా అర్థం వస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాలోని మాధ్యమిక పాఠశాలల్లో పరీక్ష నిర్వహించగా.. రాష్ట్రంలోని బిహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాటిని పర్యవేక్షిస్తుంది. ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. 2017లోనూ బోర్డు ఇదేతరహా ప్రశ్నను అడిగిందని మండిపడుతున్నాయి. ఇది పూర్తిగా మానవ తప్పిదమని బోర్డు వివరణ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news