ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై రచన రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి అధికార ప్రతినిధి రచన రెడ్డి. ఎమ్మేల్యేలు కొనుగోలు కేసులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని.. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిందన్నారు. కోర్ట్ లో ఉన్న అన్ని రిట్ అప్పేళ్లను కోర్ట్ కొట్టి వేసిందన్నారు. అత్యంత కీలక సమాచారం ప్రగతి భవన్ కి చేరిపోయాయని… సాక్షాత్తు సీఎం గారే బయటకు రిలీజ్ చేశారని, రిట్ అప్పీల్ వేయడానికి లేదని డివిజన్ బెంచ్ చెప్పిందన్నారు.

సిట్ కు, లా అండ్ ఆర్డర్ పోలీస్ ల పరిధిలోకి ఇది రాదన్నారు రచన రెడ్డి. సిట్ విచారణ తప్పులతో కూడుకొని ఉందని.. అర్హత లేకున్నా ప్రగతి భవన్ కి ఆధారాలు ఇచ్చారని పేర్కొన్నారు. కొన్ని రోజులు ఆర్డర్ ను సస్పెన్షన్ లో పెట్టాలని ప్రభుత్వం తరపున కోరిన కోర్ట్ అంగీకరించలేదన్నారు. వెంటనే FIR ను, ఆధారాలను సీబీఐ కి బదిలీ చేయాలన్నారు. బిజెపి కీర్తి ప్రతిష్టలను భంగం కలిగించేలా ఈ కేసు ను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. బదిలీ చేయక పోతే సీబీఐ వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. బిజెపి కీలక నేతలను బద్నాం చేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news