ర్యాగింగ్‌పై యాక్ష‌న్ తీసుకోండి.. జేఎన్టీయూ విద్యార్థి

-

ఉన్న‌త విద్యావేధిక‌లు అయిన యూనివ‌ర్సిటీల‌ను ఇంకా ర్యాగింగ్ వెంటాడుతూనే ఉంది. వ‌ర్సిటీల‌లో , క‌ళాశాల‌లో, హాస్ట‌ళ్ల‌లో ర్యాగింగ్‌పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా జేఎన్టీయూ విజ‌య‌న‌గ‌రం క్యాంప‌స్ విద్యార్థి త‌న గోడు వెల్ల‌బోసుకున్నారు. నా పేరు శ్రీ‌నివాస్, నేను బీటెక్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాను. మా హాస్ట‌ల్‌లో ర్యాగింగ్ తీవ్ర‌స్థాయిలో ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

క‌నీసం సీసీ కెమెరాలు లేవు. మా క్యాంప‌స్‌లోకి సీనియ‌ర్లు వ‌చ్చినా.. వార్డెన్లు స్పందించ‌లేదు. క‌ళాశాల పూర్తి కాగానే సీనియ‌ర్లు మావ‌ద్ద‌కు వ‌స్తున్నారు. క్లాస్ అయిన 30 నిమిషాల త‌రువాత వ‌చ్చి రాత్రి వ‌ర‌కు ఉండి ఇబ్బంది పెడుతున్నారు. పాట‌లు పాడ‌మంటారు. డ్యాన్స్ చేయ‌మంటారు. చికెన్‌, చేప‌లు మెస్ నుంచి తీసుకురావాల‌ని ఒత్తిడి చేస్తారు. తెచ్చే వ‌ర‌కు ఊరుకోరు.

అనేక రకాలుగా ర్యాగింగ్ చేస్తున్నారని అలాంట‌ప్పుడు మేము సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఎలా ప్రిపేయిర్ కావాలి. రోజు వారి క్లాసుల‌ను ఎలా ఎదుర్కోవాలి..? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. సీనియ‌ర్ల పై ఫిర్యాదు చేసినా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. లెక్చ‌ర‌ర్ల‌కు ఫిర్యాదు చేస్తే మా పేర్ల‌ను సీనియ‌ర్ల‌కు చెబుతున్నారు. మాకు ఈ ర్యాగింగ్ వ‌ద్దు.. ద‌య‌చేసి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోండ‌ని విజ్ఞ‌ప్తి చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news