పక్కోడి పదవులు తీయించి శునకానందం పొందేవారికి ఇలానే అవుతుంది : రఘురామ

-

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎంపీ విజయసాయిరెడ్డిపై సెటైర్లు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో ఇరుక్కుని సాయిరెడ్డి కష్టాల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు రఘురామ. విజయసాయిరెడ్డి కష్టాల్లో ఉన్నారు కాబట్టే ఆయన పేరును.. ప్యానల్ వైస్‌చైర్మన్ జాబితా నుంచి తొలగించారనుకుంటానన్నారు రఘురామ. పక్కోడి పదవులు తీయించి శునకానందం పొందేవారికి ఇలానే అవుతుందని రఘురామ హితవు పలికారు. ఏ1 మాటలు వింటే ఏ2కి ఇంకొన్ని పదవులు కూడా పోయే ప్రమాదం ఉందన్నారు రఘురామ. లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి కింగ్‌పిన్‌ కాబట్టి విచారించాల్సిందేనని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

Raghurama Raju announces resignation from MP seat

విజయసాయిని రాజ్యసభ వైస్‌చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుడుగా నియమించినట్లు రాజ్యసభ బులెటిన్‌లో రెండు రోజుల క్రితం ప్రకటించారు. ‘‘చైర్మన్‌ ప్యానెల్‌లో నన్ను చేర్చినందుకు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ధన్‌ఖడ్‌ జీకి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని విజయసాయి ఈ నెల 5న ట్వీట్‌ చేశారు కూడా. కానీ, బుధవారం రాజ్యసభ సమావేశాల మొదటి రోజున చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించిన వైస్‌ చైర్మన్‌ ప్యానెల్‌ సభ్యుల జాబితాలో ఆయన పేరు
కనిపించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news