జగన్ కు షాక్ : NGT చైర్మన్‌కు ఎంపీ రఘురామ లేఖ

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు.. జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చారు. జగన్ సర్కార్ ప ఫిర్యాదు చేస్తూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శ్ కుమార్ గోయల్ కి లేఖ రాశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో పర్యవరణ ఉల్లంఘనలు,అక్రమ తవ్వకాలు,నిర్మాణాలు చేపడుతున్నారు అని ఫిర్యాదు చేశారు రఘురామ కృష్ణ రాజు.

ఏపీ పర్యాటక శాఖ పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న అన్ని పర్యవరణ అనుమతులను , నిబంధనలను ఉల్లగిస్తున్నారని లేఖ రాశారు రఘురామ కృష్ణ రాజు. పర్యవరణ నిబంధనలను ఉల్లగిస్తున్నారని… తక్షణమే సుమోటగా కేసు విచారణ చెప్పట్టాలని లేఖలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను, పర్యవరణ ఉల్లంఘనలకు పాల్పడే వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణ రాజు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శ్ కుమార్ గోయల్ కి విజ్ఞప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news