హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యం లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని… తమ స్ట్రాటజీ లు తమకు ఉన్నాయని ప్రకటించారు. నేతల మధ్య భిన్నాభి ప్రాయాలు సహజమన్నారు రఘనందన్ రావు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని చేసిన అక్కడ గెలిచేది బీజేపీ పార్టీనేనని స్పష్టం చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు… అభ్యర్థి లేక పక్క జిల్లాల నుండి తెచ్చు కుంటున్నారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో పథకాలు అన్ని ఈటెల రాజేందర్ రాజీనామా తోనే వస్తున్నాయన్నారు రఘు నందన్ రావు. ఉప ఎన్నిక చిన్నదని మంత్రి కేటీఆర్ అంటుంటే హరీష్ రావు మాత్రం రాత్రి పగలు అక్కడే ఉంటున్నారని చురకలు అంటించారు. కాగా… ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ అదే రోజు ఫలితాలను విడుదల చేయనుంది.